బెంగళూరు, డిసెంబర్ 25: కర్ణాటక మాజీ మంత్రి, బళ్లారి గనుల కుంభకోణం నిందితుడు గాలి జనార్ధన్‌రెడ్డి కొత్త పార్టీ పెట్టారు. కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పేరుతో పార్టీని ప్రారంభిస్తున్నట్టు ఆదివారం బెంగళూరులో ప్రకటించారు. 20 ఏండ్లుగా బీజేపీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకొంటున్నట్టు ప్రకటించారు.
వచ్చే ఏడాది జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కొప్పల్ జిల్లాలోని గంగావతి స్థానం నుంచి పోటీ చేయనున్నట్టు వెల్లడించారు. త్వరలో రాష్ట్రమంతా పర్యటించి ప్రజలకు తన సిద్ధాంతాలను వివరిస్తానని తెలిపారు.