శ్రీనగర్ : మన దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను ఆపరేషన్ శివశక్తి చేపట్టి మట్టుబెట్టినట్టు సైన్యాధికారులు బుధవారం తెలిపారు. జమ్ము కశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద ఈ ఎన్కౌంటర్ జరిగింది. మంగళవారం రాత్రి ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు కల్సియాన్-గుల్పూర్ ప్రాంతంలో సరిహద్దు దాటి రావడానికి ప్రయత్నించినప్పుడు ఈ ఎన్కౌంటర్ ప్రారంభమైంది.
నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ ఆపరేషన్ చేపట్టామని అధికారులు తెలిపారు. ‘తక్షణ చర్య, కచ్చితమైన తుపాకుల ప్రయోగం దుర్మార్గపు ప్రణాళికలను తిప్పి కొట్టాయి’ అని సైన్యం 16వ పటాలం ఎక్స్‌లో పోస్ట్ చేసింది.