న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా(Omar Abdullah) ఇటీవల గుజరాత్లో టూర్ చేశారు. ఈ నేపథ్యంలో సీఎం ఒమర్ అబ్దుల్లా.. సబర్మతి రివర్‌ఫ్రంట్ తో పాటు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ సందర్శించారు. అక్కడ దిగిన ఫోటోలను తన ఎక్స్‌లో పోస్టు చేశారు అబ్దుల్లా. ఆ ఫోటోలపై ప్రధాని మోదీ రియాక్ట్ అయ్యారు. సబర్మతి, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వద్ద జమ్మూకశ్మీర్ సీఎం టూర్ చేయడం సంతోషకరమని ప్రధాని అన్నారు. అబ్దుల్లా పర్యటన ఐకమత్యాన్ని చాటుతుందన్నారు. భారతీయులు ఇతర ప్రాంతాల్లో టూర్ చేసేందుకు ఈ ఘటన ఇన్స్పిరేషన్గా నిలుస్తుందన్నారు.
జమ్మూకశ్మీర్‌కు పర్యాటకం కీలకమైంది. ఇటీవల పెహల్గామ్ దాడితో ఆ రాష్ట్ర ఆదాయం తగ్గింది. ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ఉద్దేశంతో సీఎం అబ్దుల్లా.. పర్యాటకుల్ని ఆకర్షించేందుకు గుజరాత్ టూర్ చేపట్టారు. ప్రధాని మోదీ తన ఫోటోలపై రియాక్ట్ కావడంతో.. సీఎం ఒమర్ అబ్దుల్లా దానికి కౌంటర్ పోస్టు చేశారు. ట్రావెల్ చేయడం వల్ల మన హద్దులు, మనసులు విస్తరిస్తాయి ప్రధాని గారు అంటూ పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌లో టూరిజం కీలకమైందని, లక్షల మందికి ఆదాయం అదే అన్నారు. అందుకే మా రాష్ట్రానికి వచ్చేలా భారతీయ పర్యాటకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
అహ్మదాబాద్‌లో జరిగిన ఓ టూరిజం ఈవెంట్లో పాల్గొనేందుకు వెళ్లిన సీఎం అబ్దుల్లా .. సబర్మతి రివర్ ఫ్రంట్ వద్ద మార్నింగ్ రన్ చేశారు. చాలా అందమైన ప్రదేశంలో వాకింగ్ చేసినట్లు అబ్దుల్లా పేర్కొన్నారు. అటల్ ఫూట్ బ్రిడ్జ్ మీద కూడా రన్ చేసినట్లు ఆయన చెప్పారు. తన పర్యటన సందర్భంగా గుజరాతీ టూర్ ఆపరేటర్లు, ట్రావల్ పరిశ్రమ వాటాదారులతో ఆయన చర్చించారు. వారిలో విశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేశారు.
I’m a firm believer that travel broadens the horizons & the mind @narendramodi ji. It’s especially important for us in J&K as tourism is a crucial part of our economy & has the potential to gainfully employ lakhs of people. That’s why I & my colleagues are trying to convince more… https://t.co/HJM0QQkQHW
— Omar Abdullah (@OmarAbdullah) August 1, 2025