Kashmir Papers | శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో జరిపిన ఉగ్రదాడిపై పత్రికారంగం కూడా తీవ్రంగా స్పందించింది. అనేక ప్రముఖ వార్తాపత్రికలు తమ మొదటి పేజీలను నల్ల రంగులో ముద్రించి ఉగ్రదాడిపై తమ నిరసనను, బాధితులకు సంఘీభావాన్ని వ్యక్తం చేశాయి. ఈ అవమానవీయ ఘటనను అవి తెలుపు, ఎరుపు రంగుల్లో శక్తివంతమైన శీర్షికల ద్వారా తమ భావాన్ని వ్యక్తం చేస్తూ తీవ్రంగా నిరసించాయి.
ఈ సమయంలో అన్ని వర్గాలు ఐక్యంగా నిలిచి ఉగ్రవాదంపై పోరాడాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పాయి.