శ్రీనగర్: జమ్మూ కశ్మీరులోని రాజౌరీ జిల్లాలో అంతుబట్టని వ్యాధితో 8 మంది బాలలు ప్రాణాలు కోల్పోయారు. వీరు బధాల్ గ్రామంలోని రెండు కుటుంబాలకు చెందినవారు. వైద్య పరీక్షలు చేయడంతోపాటు వ్యాధిని త్వరగా గుర్తించడం కోసం బీఎస్ఎల్-3 మొబైల్ ల్యాబొరేటరీని రాజౌరీకి పంపించారు.
జమ్మూలోని వైద్య కళాశాల, దవాఖానలో ఆరు రోజులపాటు చికిత్స పొందిన 12 ఏళ్ల బాలుడు బుధవారం తుది శ్వాస విడిచాడు. దీంతో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది.