(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే లాజిస్టిక్స్ సమస్య అడ్డంకిగా మారుతున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఈవీఎం యంత్రాలతో పాటు వందశాతం వీవీప్యాట్స్ అందుబాటులో ఉంచడం అనేది పెద్ద సమస్యని అంటున్నారు. ఎన్నికల సామగ్రిని భద్రపరుచడానికి తగినన్ని గోదాములు కూడా సమస్యగా మారింది. 15 ఏండ్లకోసారి ఈవీఎంలను మార్చాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం వినియోగిస్తున్న ఈవీఎంలలో 40% వరకు డెడ్లైన్ దాటినవేనని నిపుణులు చెబుతున్నారు. అంటే కొత్తవాటిని అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరమున్నదన్న మాట.
జమిలి ఎన్నికలు జరుగాలంటే?