న్యూఢిల్లీ: చెక్ బౌన్స్ కేసులో ఫిర్యాదుదారుతో దోషి రాజీ కుదుర్చుకుని, జైలు శిక్షను తప్పించుకోవచ్చునని సుప్రీంకోర్టు చెప్పింది. ఇరు పక్షాల మధ్య రాజీ ఒప్పందం కుదిరి, ఒప్పంద పత్రంపై సంతకాలు జరిగిన తర్వాత, నెగోషబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్‌లోని సెక్షన్ 138 ప్రకారం దోషిత్వ నిర్ధారణ కొనసాగదని స్పష్టం చేసింది.
జస్టిస్‌లు అరవింద్ కుమార్, సందీప్ మెహతా ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. చెక్కు బౌన్స్ అనే నేరం ప్రధానంగా సివిల్ తప్పు అని, ఇది రాజీ కుదుర్చుకోదగినదని తెలిపింది.