న్యూఢిల్లీ, ఆగస్టు 11: భారత 14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్ఖర్ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో గురువారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు.
ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ఉపరాష్ట్రపతులు వెంకయ్యనాయుడు, హమీద్ అన్సారీ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్, అమిత్‌షా, నిర్మలా సీతారామన్, గడ్కరీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రమాణస్వీకారం చేయడానికి ముందుగా రాజ్‌ఘాట్‌లోని మహాత్మా గాంధీ సమాధి వద్ద ధన్ఖర్ నివాళులు అర్పించారు.