న్యూఢిల్లీ: జీ7 దేశాల భేటీకి వెళ్లిన ప్రధాని మోదీ ఇండియా తిరిగి వచ్చేశారు. అయితే శుక్రవారం అక్కడ ప్రధాని మోదీతో ఇటలీ ప్రధాని మెలోని(Italy PM Giorgia Meloni) సెల్ఫీ దిగారు. చేతిలో ఫోన్ పట్టుకున్న మెలోనీ.. మోదీతో ఫోటో దిగారు. ఆ సెల్ఫీ ఫోటో ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్ అవుతోంది. జీ7 శిఖరాగ సదస్సు సందర్భంగా జార్జియా మెలోనీతో ద్వైపాక్షిక చర్చల్లో మోదీ పాల్గొన్నారు. ఇటలీలోని అపులియాలో సమావేశాలు జరిగాయి. సెల్ఫీ దిగుతూ ఇద్దరూ ఫుల్ స్మైల్ ఇచ్చుకున్నారు.
Hi friends, from #Melodi pic.twitter.com/OslCnWlB86
— Giorgia Meloni (@GiorgiaMeloni) June 15, 2024
గత ఏడాది దుబాయ్లో కాప్28 సదస్సు జరిగిన సమయంలో కూడా సెల్ఫీ దిగారు. ఆ ఫోటో కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. మూడవ సారి ప్రధాని బాధ్యతలు చేపట్టిన మోదీ తొలిసారి విదేశీ టూర్కు వెళ్లారు. మెలోనీ ఆహ్వానం మేరకు ఆయన ఇటలీ వెళ్లారు. ఇద్దరూ ద్వైపాక్షిక రక్షణ, భద్రతా సహకారంపై చర్చించారు.
PM Narendra Modi and Italy’s PM Giorgia Meloni’s selfie on the sidelines of the G7 summit, in Italy. pic.twitter.com/wE1ihPHzeq
— ANI (@ANI) June 15, 2024