Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్రలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా అధికార బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈసారి పొరపాటున కూడా బీజేపీకి ఓటేయవద్దని ఓటర్లను కోరారు.
ఈ లోక్సభ ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధంగా కేజ్రీవాల్ అభివర్ణించారు. నాడు కురుక్షేత్రలో అన్ని విధాలుగా బలవంతులైన కౌరువులను పాండవులు ఒక్క శ్రీకృష్ణుడి అండతో ఓడించారని ఆయన చెప్పారు. ఇప్పుడు బీజేపీ దగ్గర ఐబీ, సీబీఐ, ఈడీ బలాలు ఉన్నాయని, మన దగ్గర కేవలం శ్రీకృష్ణుడి ధర్మం మాత్రమే ఉన్నదని అన్నారు. కాబట్టి ఈ ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధమని వివరించారు.
బీజేపీ ట్రాప్ పడి మళ్లీ మోదీ ప్రధాని కావాలంటూ ఓటు వేయవద్దని, బాగా ఆలోచించి మీ నియోజకవర్గంలో పోటీలో ఉన్న మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలని కేజ్రీవాల్ సూచించారు. కష్ట సమయాల్లో మీ కోసం పని చేసిన నాయకుడినే మీ ప్రజా ప్రతినిధిగా ఎంపిక చేసుకోవాలని కోరారు.
#WATCH | Kurukshetra, Haryana: Delhi CM Arvind Kejriwal says, “…It is the fight between ‘dharma’ and ‘adharma’. We know that Pandavas won but Kauravas had everything…Pandavas had lord Krishna with them. What do we have with us? We are also very small but we have lord Krishna… pic.twitter.com/N40KyZkHtI
— ANI (@ANI) March 10, 2024