Prostate Cancer | దేశంపై ప్రొస్టేట్ క్యాన్సర్ పడగ.. ఏడాదికి 42 వేల కేసులు
భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ప్రొస్టేట్ క్యాన్సర్ పడగ విప్పబోతున్నదని, కేసుల సంఖ్య, మరణాలు భారీగా పెరిగే ప్రమాదం పొంచి ఉన్నదని లాన్సెట్ కమిషన్ ఆన్ ప్రొస్టేట్ క్యాన్సర్ అధ్యయనంలో వెల్లడైంది.
- 2040 నాటికి కేసులు రెట్టింపు!
- తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లోనే అధికం
- మరణాలూ 85 శాతం పెరగొచ్చు
- లాన్సెట్ అధ్యయనం హెచ్చరిక
Prostate Cancer | న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ప్రొస్టేట్ క్యాన్సర్ పడగ విప్పబోతున్నదని, కేసుల సంఖ్య, మరణాలు భారీగా పెరిగే ప్రమాదం పొంచి ఉన్నదని లాన్సెట్ కమిషన్ ఆన్ ప్రొస్టేట్ క్యాన్సర్ అధ్యయనంలో వెల్లడైంది. భారత్‌తో పాటు తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో ఎక్కువగా ప్రొస్టేట్ క్యాన్సర్ కేసులు పెరుగుతాయని ఈ అధ్యయనం అంచనా వేసింది. 2020 నుంచి 2040 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రొస్టేట్ క్యాన్సర్ కేసులు రెట్టింపు అవుతాయని, ఈ వ్యాధి కారణంగా మరణాలు కూడా 85 శాతం పెరిగే అవకాశం ఉందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం భారత్‌లో నమోదవుతున్న మొత్తం క్యాన్సర్ కేసుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ కేసులు దాదాపుగా మూడు శాతం వరకు ఉంటున్నాయి. ఇప్పుడు భారత్‌లో ఏడాదికి 33 వేల నుంచి 42 వేల ప్రొస్టేట్ క్యాన్సర్ కేసులను గుర్తిస్తున్నారు. 2040 నాటికి భారత్‌లో ఏడాదికి 71 వేల మంది దీని బారిన పడవచ్చని ఈ అధ్యయనం అంచనా వేసింది.
దేశంలో ఏడాదికి 18 వేల మరణాలు
భారత్‌తో పాటు తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ బారిన పడ్డ వారిని గుర్తించడం ఆలస్యం అవుతుండటమే అసలు సవాల్‌గా మారింది. చాలామందిలో వ్యాధి ముదిరిన తర్వాతనే ప్రొస్టేట్ క్యాన్సర్‌ను గుర్తించడం వల్ల మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. భారత్‌లో ఎక్కువ మందిలో వ్యాధి తుది దశల్లో ఉన్నప్పుడు గుర్తించడం వల్ల 65 శాతం బాధితులు మరణిస్తున్నారని ఈ అధ్యయనంలో పాల్గొన్న డాక్టర్ వేదాంగ్ మూర్తి పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో ప్రొస్టేట్ క్యాన్సర్‌తో ఏడాదికి 18 వేల నుంచి 20 వేల మరణాలు సంభవిస్తున్నట్టు చెప్పారు. 60 ఏండ్లు దాటిన పురుషులకు క్రమం తప్పకుండా పరీక్షలు జరపడం ద్వారా వ్యాధిని వేగంగా గుర్తించి చికిత్స అందించవచ్చని ఆయన తెలిపారు. వయసు, జన్యుపరమైన కారణాలతో పాటు ధూమపానం, ఒబెసిటీ, సరైన ఆహారం తీసుకోకపోవడం, జీవనశైలి సమస్యల వల్ల ప్రొస్టేట్ క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య పెరుగుతున్నట్టు వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రొస్టేట్ క్యాన్సర్ కేసులు(ఏడాదికి)
2020లో – 14 లక్షలు
2040లో – 29 లక్షలు(అంచనా)
ప్రపంచవ్యాప్తంగా మరణాలు(ఏడాదికి)
2020లో – 3.75 లక్షలు
2040లో – 7 లక్షలు(అంచనా)
భారత్‌లో ప్రొస్టేట్ క్యాన్సర్ కేసులు(ఏడాదికి)
ప్రస్తుతం – 33,000 – 42,000
2040లో – 71,000(అంచనా)
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

