న్యూఢిల్లీ, నవంబర్ 17 : ఆదాయ పన్ను రిటర్న్(ఐటీఆర్)లో విదేశీ ఆస్తులు, విదేశాల నుంచి వచ్చే ఆదాయాన్ని వెల్లడించకపోతే నల్ల ధన వ్యతిరేక చట్టం కింద రూ.10 లక్షలు జరిమానా విధిస్తామని ఆదాయ పన్ను శాఖ ఆదివారం హెచ్చరించింది. భారత్‌లో నివసించే పన్ను చెల్లింపుదారులు గతేడాది విదేశీ ఆస్తులకు సంబంధించిన బ్యాంకు ఖాతాలు, బీమా ఒప్పందాలు, వార్షిక ఒప్పందాల నగదు విలువ, వ్యాపారం లేదా వ్యాపార సంస్థల్లోని ఆర్థిక ప్రయోజనాలు, స్థిరాస్తులు, కస్టోడియన్ అకౌంట్, ఈక్విటీ(షేర్లు), రుణాల వడ్డీ, ట్రస్ట్‌లకు ట్రస్టీగా ఉన్న వివరాలు, ట్రస్ట్ స్థాపించిన వారి నుంచి పొందిన లబ్ధి, బ్యాంక్ ఖాతాలకు సంతకం చేసే అధికార వివరాలు, ఏవైనా పెట్టుబడి ఆస్తులను ఐటీఆర్‌లో పేర్కొనాలి. వారు తప్పనిసరిగా విదేశీ ఆస్తులను లేదా విదేశీ ఆదాయ మార్గాలను తమ ఐటీఆర్‌లో వెల్లడించాలి. సవరించిన ఐటీఆర్ సమర్పించడానికి డిసెంబర్ 31 ఆఖరు తేదీ.