ఆగ్రా: ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ముగ్గురు చెప్పుల అమ్మకందారులకు సంబంధించిన ప్రదేశాల్లో దాడులు నిర్వహించినట్లు ఆదాయపు పన్ను శాఖ ఆదివారం తెలిపింది. లెక్కల్లో చూపని నగదును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకు రూ.40 కోట్లు లెక్కించామని, మిగిలిన నగదును లెక్కించవలసి ఉందని చెప్పింది. వీరు పన్నుల ఎగవేత, మోసాలకు పాల్పడినట్లు అనుమానం వ్యక్తమవుతున్నదని తెలిపింది.