Gaganyaan | బెంగళూరు: మానవసహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్’కు ఇస్రో ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో భాగంగా ఒకట్రెండు నెలల్లో తొలి టెస్ట్ ఫ్లైట్‌ను చేపట్టనున్నది. ఇస్రో అధికారి ఒకరు శుక్రవారం ఈ విషయం వెల్లడించారు. వ్యోమగాములు సురక్షితంగా తప్పించుకునే వ్యవస్థను పరీక్షించేందుకు టెస్ట్ వెహికిల్ మిషన్‌ను చేపట్టనున్నారు.
మొదటి టెస్ట్ వెహికిల్ మిషన్ టీవీ-డీ1 తర్వాత రెండో టెస్ట్ వెహికిల్ మిషన్ టీవీ-డీ2, మొదటి మానవరహిత మిషన్ ఎల్వీఎం3-జీ1 ప్రయోగాలు జరుగుతాయని తెలిపారు. ఆ తర్వాత ఈ ప్రయోగంలో రెండో సిరీస్ టెస్ట్ వెహికిల్ మిషన్స్ (టీవీ-డీ3, డీ4), రోబోటిక్ పేలోడ్‌తో ఎల్వీఎం3-జీ2 మిషన్ ప్రయోగాలు జరుగుతాయని చెప్పారు.