శ్రీహరికోట, డిసెంబర్ 28 : భారీ శాటిలైట్స్‌ను రోదసిలోకి పంపేందుకు ఇస్రో శ్రీహరికోట వద్ద నిర్మిస్తున్న మూడవ లాంచ్ ప్యాడ్ 2029నాటికి అందుబాటులోకి రాబోతున్నది. దీని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, నాలుగేండ్లలో ఇది పూర్తిస్థాయిలో సిద్ధమవుతుందని ఇస్రో ఉన్నతాధికారి పద్మకుమార్ తెలిపారు.
భవిష్యత్ ప్రయోగాల్లో ఇస్రో సామర్థ్యాన్ని ఈ లాంచ్ ప్యాడ్ మరింత పెంచుతుందని అన్నారు. 12వేల నుంచి 14వేల కిలోల బరువుండే భారీ శాటిలైట్స్‌ను అంతరిక్షంలోకి పంపే విధంగా మూడవ లాంచ్ ప్యాడ్‌ను ఇస్రో నిర్మిస్తున్నది.