INSAT-3DS first pictures | తొలి చిత్రాలు పంపిన ఇన్శాట్-3డీఎస్.. అద్భుతంగా కనిపించిన భారత్
INSAT-3DS first pictures | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ ఏడాది ఫిబ్రవరి 17న లాంచ్ చేసిన ఇన్శాట్-3డీఎస్ శాటిలైట్ తొలి చిత్రాలు పంపింది. ఈ చిత్రాల్లో భారత్ ఎంతో అద్భుతంగా కనిపించింది. ఈ అత్యాధునిక ఉపగ్రహంలో అధునాతన ఇమేజర్, సౌండర్ పేలోడ్స్ వంటి పరికరాలున్నాయి.
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ ఏడాది ఫిబ్రవరి 17న లాంచ్ చేసిన ఇన్శాట్-3డీఎస్ (INSAT-3DS) శాటిలైట్ తొలి చిత్రాలు పంపింది. ఈ చిత్రాల్లో భారత్ ఎంతో అద్భుతంగా కనిపించింది. ఈ అత్యాధునిక ఉపగ్రహంలో అధునాతన ఇమేజర్, సౌండర్ పేలోడ్స్ వంటి పరికరాలున్నాయి. భూమి, భూ వాతావరణానికి సంబంధించిన అంశాలను ఈ పరికరాలు ఎంతో స్పష్టతతో ఫొటోలు తీయడంతోపాటు డేటాను విశ్లేషిస్తాయి.
కాగా, భూమితోపాటు భారత్కు సంబంధించి ఇన్శాట్-3డీఎస్ పంపిన తొలి చిత్రాలను ఇస్రో సోమవారం విడుదల చేసింది. ఈ శాటిలైట్లోని 6 ఛానల్ ఇమేజర్ పరికరాలు భూమి, భూ ఉపరితలం, వాతావరణం చిత్రాలను పలు తరంగదైర్ఘ్యాల్లో తీశాయని తెలిపింది. మేఘాలు, ఏరోసోల్స్, భూమి ఉపరితల ఉష్ణోగ్రత, పర్యావరణ పరిస్థితి, నీటి ఆవిరి వంటి వాతావరణ, భూ ఉపరితలానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు బహుళ ఛానెల్ ఇమేజర్ ఎంతో ఉపకరిస్తుందని ఇస్రో పేర్కొంది. ఇన్శాట్-3డీఎస్ పంపిన తొలి ఫోటోలను ఎక్స్లో షేర్ చేసింది.
INSAT-3DS Mission:
First glimpse of the beauty and complexity of Earth through modern Imager and Sounder payloads onboard INSAT-3DS.This data serves as crucial input for Indian scientists for mereological studies, weather forecasts, and understanding atmospheric dynamics.… pic.twitter.com/XVF1JviKAW
— ISRO (@isro) March 11, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

