బెంగళూరు, డిసెంబర్ 26: ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. బ్లాక్ హోల్స్ (కృష్ణ బిలాలు), న్యూట్రాన్ స్టార్స్.. వివిధ ఖగోళ వస్తువుల నుంచి వెలువడుతున్న అత్యంత తీక్షణమైన ఎక్స్-కిరణాల అధ్యయనానికి మొట్టమొదటిసారిగా పోలారిమెట్రి మిషన్ చేపడుతున్నది.
పీఎస్ఎల్వీ-సీ58 ద్వారా ‘ఎక్స్పో-శాట్’ శాటిలైట్‌ను జనవరి 1న ఉదయం 9.10 గంటలకు అంతరిక్షంలోకి పంపుతున్నట్టు ఇస్రో తాజాగా వెల్లడించింది. శాటిలైట్‌ను భూమికి 500 నుంచి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్ష్యలో ప్రవేశపెట్టనున్నది.