శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Mar 04, 2020 , 17:25:35

5వ తేదీన జీశాట్‌-1 ప్ర‌యోగం

5వ తేదీన జీశాట్‌-1 ప్ర‌యోగం

హైద‌రాబాద్‌:  జీశాట్‌-1ను ఇస్రో ఈనెల 5వ తేదీన ప్ర‌యోగించ‌నున్న‌ది. ఆ రోజున సాయంత్రం 5.43 నిమిషాల‌కు ప్ర‌యోగం జ‌ర‌గ‌నున్న‌ది. జియోస్టేష‌న‌రీ ఎర్త్ అబ్జ‌ర్వేష‌న్ శాటిలైట్‌ను భార‌త్ ప్ర‌యోగించ‌డం ఇదే తొలిసారి. ఓ ప్రాంతానికి సంబంధించిన రియ‌ల్ టైమ్ ఇమేజ్‌ల‌ను ఈ ఉప‌గ్ర‌హం అందిస్తుంది. ప్ర‌కృతి విపత్తుల‌ను కూడా ఇది మానిట‌ర్ చేస్తుంది.  జీశాట్‌-1 బ‌రువు 2268 కిలోలు. శ్రీహ‌రికోట‌లోని రెండ‌వ లాంచ్ ప్యాడ్‌ను నుంచి జీఎస్ఎల్వీ రాకెట్‌ను ప్ర‌యోగిస్తారు.  18 నిమిషాల త‌ర్వాత జీశాట్‌-1 ఉప‌గ్ర‌హం... జీటీవో క‌క్ష్య‌లోకి చేరుకుంటుంది. జియోస్టేష‌న‌రీ ఆర్బిట్ భూమికి సుమారు 36వేల కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది.  జీశాట్-1 ఉప‌గ్ర‌హం ఏడేళ్ల పాటు ప‌నిచేయ‌నున్న‌ది.


logo