న్యూఢిల్లీ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మునుపెన్నడూ లేనంతగా బిజీ షెడ్యూల్‌తో నిండిపోయిందని ఆ సంస్థ చైర్మన్ వీ నారాయణన్ అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, 2028లో చేపట్టబోతున్న చంద్రయాన్-4 మిషన్‌కు కేంద్రం ఆమోదం తెలిపిందని అన్నారు.
చంద్రుడికి సంబంధించి ఇస్రో చేపడుతున్న అత్యంత సంక్లిష్టమైన, సవాల్‌తో కూడిన ప్రయోగం ఇదేనని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా ఏడు రోదసి ప్రయోగాలు ఇస్రో చేపట్టాల్సి ఉందని, మరోవైపు 2027లో మానవ సహిత రోదసి యాత్ర ఉందని చెప్పారు.