బెంగళూరు: పునర్వినియోగ వాహకనౌక కోసం అవసరమైన సాంకేతిక పరిజ్ఞాన్నా అభివృద్ధిలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో ముందడుగు వేసింది. పుష్పక్ పేరుతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన రీయూజబుల్ లాంచ్ వెహికల్ (RLV)03ని మరోసారి విజయవంతంగా పరీక్షించింది. ఆదివారం ఉదయం కర్ణాటకలోని చిత్రదుర్గ ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్లో (ATR) ట్రయల్ ప్రయోగాన్ని నిర్వహించింది. దాదాపు 320 కిలో మీటర్ల వేగంతో నేల మీదకు దిగిన పుష్పక్ (Pushpak).. సొంతంగా రన్‌వే పై ల్యాండ్ అయింది. దానికదే వేగాన్ని తగ్గించుకొని ఆగిపోయింది. దీంతో ఇప్పటికే రెండుసార్లు చేసిన ప్రయోగం విజయవం సాధించగా, మూడోసారి కూడా ప్రయోగం చేసి విజయం సాధించినట్లు ఇస్రో ప్రకటించింది.
వినర్వినియోగ వాహక నౌక ల్యాండింగ్ ఎక్స్పరిమెంట్లో ఇస్రో మూడో, చివరి వరుస విజయన్ని సాధించిందని ఎక్స్ వేదికగా వెల్లడించింది. పుష్పక్ ఒక ఖచ్చితమైన క్షితిజ సమాంతర ల్యాండింగ్‌ను అమలుచేస్తున్నదని తెలిపింది. సవాలుతో కూడిన పరిస్థితుల్లో అధునాతన స్వయంప్రతిపత్తి సామర్ధ్యాలను ప్రదర్శిస్తున్నదని వెల్లడించింది.
పుష్పక్ అనేది పునర్వినియోగ లాంచ్ వెహకిల్. పూర్తిగా పునర్వినియోగపరచదగిన సింగిల్ స్టేజ్-టు-ఆర్బిట్ (SSTO) వాహనంగా దీనిని రూపొందించారు. ఎక్స్-33 అడ్వాన్స్ డ్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్, ఎక్స్-34 టెస్ట్ బెడ్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్, అప్ గ్రేడ్ చేసిన డీసీ-ఎక్స్ ఏ ఫ్లైట్ డెమాన్స్ట్రేటర్ వంటి ప్రధాన అంశాలు ఇందులో ఉన్నాయి. పుష్పక్‌లో ఫ్యూజ్ లేజ్, నోస్ క్యాప్, డబుల్ డెల్టా వింగ్స్, ట్విన్ వర్టికల్ టెయిల్స్ ఉంటాయని ఇస్రో తెలిపింది. ఇది ఎలెవోన్స్, రూడర్ అనే చురుకైన నియంత్రణ ఉపరితలాలను కూడా కలిగి ఉంది.
RLV-LEX3 images pic.twitter.com/PO0v0StC3A
— ISRO (@isro) June 23, 2024