ఝాన్సీ: ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘గగన్‌యాన్ మిషన్‌లో కీలక ముందడుగు వేసింది. ఈ నెల 3న యూపీలోని ఝాన్సీ వద్ద చేపట్టిన పారాచూట్ ఎయిర్‌డ్రాప్ టెస్ట్ (ఐఎంఏటీ) విజయవంతమైంది. రోదసి నుంచి బయల్దేరిన వ్యోమగాముల వాహకనౌకను సురక్షితంగా భూమి మీదకు దింపేందుకు పారాచూట్ ఎయిర్‌డ్రాప్ విధానాన్ని అనుసరిస్తారు.
నాలుగు భిన్నమైన సైజుల్లో ఉండే మొత్తం 10 పారాచూట్లతో ‘గగన్‌యాన్ క్రూ మాడ్యూల్’ను రూపొందించారు. వ్యోమనౌక వేగాన్ని క్రమంగా తగ్గించేందుకు పారాచూట్లను తెరుస్తారు. గగన్‌యాన్ మిషన్‌లో ఇస్రో మానవరహిత ప్రయోగానికి వచ్చే ఏడాది జనవరిలో సిద్ధమవుతున్నది.