శ్రీహరికోట: యురోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 మిషన్ కోసం ఇవాళ కౌంట్‌డౌన్ మొదలైంది. 8.5 గంటల కౌంట్‌డౌన్‌కు చెందిన అప్డేట్ ఇస్రో ఇచ్చింది. వాస్తవానికి బుధవారం సాయంత్రం 4.08 నిమిషాలకు ప్రోబా-3 నింగికి ఎగరాల్సి ఉంది. కానీ ఆ మిషన్‌కు ఇవాళ్టికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. యురోపియన్ స్పేస్ ఏజెన్సీ అభ్యర్థన మేరకు పీఎస్ఎల్వీ సీ59(PSLV-C59) ప్రయోగాన్ని వాయిదావేసినట్లు ఇస్రో వెల్లడించింది. ఇవాళ సాయంత్రం 4.04 నిమిషాలకు పీఎస్ఎల్వీసీ59 నింగికి ఎగురుతుంది.
🚀 PSLV-C59/PROBA-3 Mission Update:
Countdown Commenced!
🕒 Liftoff Time: 16:04 IST, 5th Dec 2024
Stay tuned as PSLV-C59 prepares to deploy ESA’s Proba-3 satellites into orbit!
Join @NSIL_India, @isro, and @esa as history unfolds! 🌌
— ISRO (@isro) December 5, 2024
యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి ప్రోబా-3లో రెండు ఉపగ్రహాలు (310 కిలోల బరువైన కరోనాగ్రాఫ్, 240 కిలోల బరువైన ఆక్యుల్టర్) ఉంటాయి. సూర్యుడి గుట్టు విప్పేందుకు కృత్రిమ గ్రహణాన్ని సృష్టించడం, తద్వారా సూరుడి బాహ్య వాతావరణమైన కరోనాను అధ్యయనం చేయడం ప్రోబా-3 లక్ష్యం.