బెంగళూరు: ఆదిత్య-ఎల్1 ప్రయోగంలో ఇస్రో మాజీ చైర్మన్ ప్రొ. యూఆర్ రావు పరోక్షంగా కీలకపాత్ర పోషించారు. ఆయన సలహా మేరకే ఈ శాటిలైట్‌ను ఎల్1 పాయింట్ వద్ద ప్రవేశపెట్టేందుకు ఇస్రో సన్నాహాలు చేసింది. మొదట ఆదిత్య-ఎల్1 శాటిలైట్‌ను లో ఎర్త్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టాలని ఇస్రో ప్రణాళికలు రచించింది. అయితే దీని వల్ల సూర్యగ్రహణం సమయంలో సూర్యుడిపై పరిశోధనలు చేసేందుకు వీలుపడదు. నిరంతరం సూర్యుడిపై అధ్యయనం చేసేలా.. ఎల్1 పాయింట్ వద్ద శాటిలైట్‌ను ప్రవేశపెట్టాలని యూఆర్ రావు సూచించారు.