వీరావల్: ఇస్రో చీఫ్(ISRO chief) ఎస్ సోమనాథ్.. ఇవాళ గుజరాత్‌లోని సోమనాథ ఆలయంలో పూజలు చేశారు. భవిష్యత్తులో ఇస్రో చేపట్టబోయే ప్రాజెక్టుల కోసం సోమనాధీశ్వరుడి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆలయంలో ఆయన సోమేశ్వర మహాపూజ నిర్వహించారు. దీనిలో భాగంగా ఆయన యజ్ఞంలో కూడా పాల్గొన్నారు. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ తమ కల అని, జ్యోతిర్లింగ స్వరూపుడు సోమనాధీశ్వరుడి వల్లే ఆ మిషన్ సక్సెస్ అయినట్లు ఇస్రో చీఫ్ వెల్లడించారు. తమ పనులు పూర్తి చేసుకునేందుకు శక్తి కావాలని, మూన్‌పై ల్యాండింగే కీలకమైన అంశమని, భవిష్యత్తులో చేపట్టబోయే మిషన్లకు శక్తి కావాలని దేవుడిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. సోమనాథ ఆలయానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న భాల్క తీర్థను కూడా ఆయన విజిట్ చేశారు. భాల్క తీర్థ ప్రాంతంలోనే శ్రీకృష్ణ భగవానుడు తన తుదిశ్వాస విడిచినట్లు పురాణాలు చెబుతున్నాయి.
#WATCH | ISRO Chief S Somnath offers prayers and does Puja at Shree Somnath temple in Gujarat
(Video Source: Somnath Temple Trust) pic.twitter.com/cVdC00YWd7
— ANI (@ANI) September 28, 2023