ISRO Chief Somanath | రామేశ్వరం: చంద్రయాన్-3 విజయం నేపథ్యంలో రాకెట్ల తయారీకి సంబంధించి మనదేశ సైంటిస్టులు వాడిన టెక్నాలజీని తమతో పంచుకోవాలని అమెరికా కోరినట్టు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు. అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి రాకెట్ల తయారీ అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ అని , చంద్రయాన్-3 టెక్నాలజీ తెలుసుకునేందుకు అమెరికా నిపుణులు ఆసక్తి కనబర్చారని అన్నారు.
మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 92వ జయంతి సందర్భంగా శనివారం రామేశ్వరంలో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘భారత టెక్నాలజీనిని అమెరికా అడిగింది. దీనిని బట్టి రాకెట్ టెక్నాలజీలో భారత్ సాధించిన విజయాన్ని విద్యార్థులు అర్థం చేసుకోవాలి’ అని అన్నారు.