ISRO | న్యూఢిల్లీ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అద్భుత విజయాలు సాధిస్తున్నది. గత నెల 30న ప్రయోగించిన పీఎస్4-ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్ (పీఓఈఎం)లో బొబ్బర గింజలు (కౌపీ సీడ్స్) మొలకెత్తాయి. వీటికి ఆకులు కూడా మరికొద్ది రోజుల్లో రావచ్చునని ఆశిస్తున్నారు. దాదాపు శూన్య గురుత్వాకర్షణ స్థితిలో, అంతరిక్ష పరిసరాల్లో జీవం మొలకెత్తడం భారత దేశానికి ఇదే మొదటిసారి. ఈ వివరాలను ఇస్రో శనివారం వెల్లడించింది. పీఓఈఎం గత నెల 30న ఇస్రో ప్రయోగించిన స్పేడెక్స్‌లో భాగం. ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ మాట్లాడుతూ, భారతీయ స్పేస్ ల్యాబ్‌లో జీవి మొలకెత్తడం చాలా ఉత్తేజితంగా ఉందన్నారు.
ఇస్రో అంతరిక్షంలోకి పంపిన మొదటి రోబోటిక్ చెయ్యి విజయవంతంగా పని చేసింది. ఇది స్పేడెక్స్ మిషన్‌లో భాగం.పీఎస్4-ఆర్బిటల్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్ ప్లాట్‌ఫారమ్‌లో నిర్దిష్ట లక్ష్యాలకు అనుగుణంగా ఈ రోబోటిక్ చెయ్యి పనిచేయనుంది. ఈ విజయం మన దేశ రోదసి ప్రయోగాలు, అంతరిక్షం గురించి తెలుసుకునే ప్రయత్నాల్లో చెపుకోదగ్గ మైలురాయిగా నిలిచింది.