బెంగళూరు: సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ డిజైన్, అభివృద్ధిలో ఇస్రో చెప్పుకోదగ్గ పురోగతి సాధించింది. 2,000 కిలో న్యూటన్ల బలంతో ఈ ఇంజిన్‌ను రూపొందించగలిగింది. లాంచ్ వెహికిల్ మార్క్-3 సెమీ క్రయోజెనిక్ బూస్టర్ స్టేజ్‌ని బలోపేతం చేస్తుంది.
తమిళనాడులోని మహేంద్రగిరి, ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో ఈ నెల 28న నిర్వహించిన పరీక్షలో ఈ ముందడుగు పడిందని ఇస్రో ప్రకటించింది.