ISRO | ఇస్రో వందో ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరి కోటలోని షార్ నుంచి జీఎస్ఎల్వీ రాకెట్-15 నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్ ఎన్వీఎస్-02 ఉపగ్రహాన్ని రోదసిలోకి తీసుకెళ్లింది.
భారత నావిగేషన్ వ్యవస్థ నావిక్ సిరీస్‌లోని ఈ రెండో ఉపగ్రహం కచ్చితమైన పొజిషన్, వేగం, టైమింగ్‌తో భారత ఉపఖండం అవతల 1500 కి.మీ పరిధి వరకు యూజర్లకు కచ్చితమైన గమన సూచనలు(నావిగేషన్, ముఖ్యంగా నౌకాయానం) అందిస్తుంది. 50.9 మీటర్ల పొడవైన రాకెట్ జీఎస్ఎల్వీ-ఎఫ్12 మిషన్‌లో ఎన్వీఎస్-01 ఉపగ్రహాన్ని గతేడాది మే 29 విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. నేడు నింగిలోకి దూసుకెళ్లిన 2,250 కిలోల బరువైన ఎన్వీఎస్-02 శాటిలైట్‌ను యూఆర్ శాటిలైట్ కేంద్రంలో రూపొందించి అభివృద్ధి పరిచారు. ఇందులో రేజింగ్ పేలోడ్‌కు అదనంగా ఎల్1, ఎల్5 నావిగేషన్ పేలోడ్లు ఉన్నాయి. ఈ ఉపగ్రహం అందించే నావిగేషన్ సమాచారాన్ని గగనతల, భూతల, జల మార్గాల్లో ఉపయోగించుకోవచ్చు. విమానాల నిర్వహణకు, మొబైల్స్‌లో స్థాన ఆధారిత సేవలకు, ఉపగ్రహాల కక్ష్య నిర్ధారణకు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారిత అప్లికేషన్లకు, ఈ ఉపగ్రహపు నావిగేషన్‌ను వాడుకోవచ్చని ఇస్రో తెలిపింది.
#WATCH | Tirupati, Andhra Pradesh: ISRO launchs its 100th mission, the NVS-02 navigation satellite aboard the launch vehicle GSLV-F15 from Sriharikota in Andhra Pradesh at 6.23 am today.
(Source: ISRO) pic.twitter.com/n5iY9N8N0p
— ANI (@ANI) January 29, 2025
46 ఏండ్లలో 99 ప్రయోగాలు..
భారత్ తన మొదటి పెద్ద ఉపగ్రహాన్ని 1970, ఆగస్టు 10న శ్రీహరికోట నుంచి ప్రయోగించింది. ఇస్రో 99 ప్రయోగాలు చేయడానికి 46 ఏండ్ల సుదీర్ఘ కాలం పట్టింది. ఇప్పటివరకు ఇస్రో సాధించిన ప్రగతి వెనుక పలు తరాల శాస్త్రవేత్తల కృషి ఉన్నదని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం సంచాలకులు రాజరాజన్ మంగళవారం మీడియాకు తెలిపారు.