జెరూసలెం: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన భారత పర్యటనను ఈ ఏడాదిలో మూడోసారి వాయిదా వేసుకున్నారు. న్యూఢిల్లీలో రెండు వారాల క్రితం బాంబు పేలుడు ఘటన వల్ల భారత్లో నెతన్యాహు భద్రతపై ఆందోళన రేకెత్తడంతోనే ఆయన పర్యటన వాయిదా పడిందని ఇజ్రాయెల్ మీడియా రిపోర్ట్ చేసింది. భద్రత పరిస్థితులు మెరుగైతే వచ్చే ఏడాది నెతన్యాహు భారత్లో పర్యటించే అవకాశం ఉందని తెలిపింది.