లక్నో: పెండ్లి ఊరేగింపులో లక్షల రూపాయల నోట్ల వర్షం కురిసిన దృశ్యాలు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి. యూపీలోని సిద్ధార్ధనగర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. అఫ్జల్, అంజాన్ల పెండ్లి ఊరేగింపు సందర్భంగా వరుడి తరపు బంధువులు కొందరు ఇళ్ల పై అంతస్తు, డాబాపై నిలబడి ఊరేగింపుపై 500, 200, 100 రూపాయల నోట్లను కట్టలకు కట్టలు విడదీసి మరీ వెదజల్లారు. డబ్బును వెదజల్లడానికి వారు ఒక జేసీబీని కూడా వినియోగించడం విశేషం. దీంతో ఆ నోట్లను ఏరుకోవడానికి గ్రామస్తులు ఎగబడ్డారు. సుమారు 20 లక్ష రూపాయలను ఇలా వెదజల్లినట్టు వరుడి బంధువులు తెలిపారు.