ముంబై: అనంత్ అంబానీ(Anant Ambani) ఔదర్యం ప్రదర్శించాడు. జంతు సంరక్షణ కేంద్రం వంతారాకు.. కొత్తగా రెండు ఏనుగుల్ని తీసుకురానున్నారు. కోల్‌కతా సమీపంలోని మాయాపూర్‌లో ఉన్న ఇస్కాన్‌లో రెండు ఏనుగులు ఉన్నాయి. 18 ఏళ్ల బిష్ణుప్రియ, 26 ఏళ్ల లక్ష్మీప్రియాలను.. ఇప్పుడు వంతారా జంతు సంరక్షణ కేంద్రానికి తీసుకున్నారు. ఇక నుంచి ఆ ఏనుగుల బాగోగులు అక్కడే చూసుకోనున్నారు.
గత ఏప్రిల్‌లో మావోతుపై బిష్ణుప్రియా దాడి చేసింది. ఈ నేపథ్యంలో దాని సంరక్షణ చూసుకునేందుకు అనంత్ అంబానీ ముందుకు వచ్చారు. ప్రత్యేకమైన కేర్ అవసరమన్న విషయాన్ని ఆ సంఘటన చెబుతోందని వంతారా పేర్కొన్నది. ఏనుగులకు సహజసిద్దమైన పరిస్థితుల్ని వంతారాలో కల్పించనున్నారు. వెటర్నరీ కేర్ తీసుకోనున్నారు.
వంతారా కేంద్రంలో ఉన్న ఇతర ఏనుగులతో కలిసే విధంగా ఆ కొత్త ఏనుగుల్ని తీర్చుదిద్దుతారు. లక్ష్మీప్రియా, బిష్ణుప్రియా ఏనుగులు ఇస్కాన్‌లో జరిగే వేడుకలకు వాడుకుంఉటన్నారు. అయితే ఇటీవల ఓ ఏనుగు మావోతుపై అటాక్ చేసింది. ఈ నేపథ్యంలో వాటిని తరలిస్తున్నారు.