కోల్కతా: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ మేనకా గాంధీపై ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ ఇస్కాన్ రూ.100 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేసింది. ఈ మేరకు సంస్థ ఆమెకు నోటీసులు పంపింది. ‘ఇస్కాన్ గోశాలల్లో ఉన్న ఆవులను కబేళాలకు అమ్మేస్తున్నారు’ అని ఆమె ఇటీవల తీవ్ర ఆరోపణలు చేశారు.
దీనిపై తీవ్రంగా స్పందించిన ఇస్కాన్ ఆమెకు పరువు నష్టం దావా నోటీసు పంపినట్టు సంస్థ కోల్కతా వైస్ ప్రెసిడెంట్ రాధారమణ్ దాస్ తెలిపారు.