ముంబై : మహారాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలకు ముందు.. మంత్రి నవాబ్ మాలిక్‌ను పదవి నుంచి తొలగించకుండా ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని ప్రభుత్వ నిర్ణయంపై బీజేపీ నేతలు గురువారం నిరసన తెలిపారు. పారరీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం, అతని అనుచరులతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో గతవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం మంత్రిని పదవి నుంచి తొలగించాలని బీజేపీ డిమాండ్ చేస్తు్న్నది. 1993లో ముంబైలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల సూత్రదారి దావూత్ ఇబ్రహీం సహచరులతో సంబంధాలపై మంత్రిని అరెస్టు చేయడంతో మహారాష్ట్ర చరిత్రలో తొలిసారి అని బీజేపీ నేత, మహారాష్ట్ర అసెంబ్లీలో విపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ఈ సందర్భంగా మాలిక్‌ను ఎందుకు కాపాడుతున్నారు? ప్రభుత్వం దావూద్ ఇబ్రహీంకు కట్టుబడి ఉందా? ప్రభుత్వం ఎవరి ఒత్తిడిపై పని చేస్తుంది? అని ఉద్ధవ్ సర్కారును ప్రశ్నించారు.
ఇదిలా ఉండగా.. శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా.. గవర్నర్ భగత్ కోష్యారీ ప్రసంగం పూర్తి కాకుండానే విధాన్ భవన్ నుంచి వెళ్లిపోయారు. గవర్నర్ సెంట్రల్ హాల్ వేదికపైకి రాగానే.. పాలక మహా వికాస్ అఘాడి సభ్యులు కోష్యారికి వ్యతిరేకంగా.. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ను కీర్తిస్తూ నినదించారు. శివాజీపై గవర్నర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే విమర్శలు గుప్పించారు. వెంటనే గవర్నర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
A Minister is in Jail & still hasn’t resigned!
जे कधीही इतिहासात घडले नाही, ते महाराष्ट्रात घडते आहे.
राज्याचे मंत्री नवाब मलिक हे जेलमध्ये आहेत,
त्यांनी अजून राजीनामा दिलेला नाही वा त्यांचा राजीनामा घेतलेला नाही.
आरोप साधा नाही, तर मुंबईच्या मारेकऱ्यांशी आर्थिक व्यवहार झाला आहे. pic.twitter.com/oyD37ubSeg— Devendra Fadnavis (@Dev_Fadnavis) March 3, 2022