Cloth Masks | ప్రస్తుతం ప్రపంచమంతా మరోసారి వణికిపోతోంది. గడగడలాడుతోంది. ఇప్పటికే ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌ల తాకిడికి తట్టుకొని ఎలాగొలా నిలబడ్డాం. ఇంతలో థర్డ్ వేవ్ రూపంలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ విరుచుకుపడింది. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌తో పోల్చితే ఈ కొత్త వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటం గమనార్హం. వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో ప్రజలంతా బయటికి వెళ్లినప్పుడు ఖచ్చితంగా మాస్కులు ధరించాలని అన్ని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి.
ఈనేపథ్యంలో మాస్కులపై మరోసారి చర్చ ప్రారంభమైంది. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌కు క్లాత్ మాస్కులను, సింగిల్ లేయర్ ఉన్న మాస్కులను పెట్టుకున్నా కొంతమేరకు అవి కరోనాను కట్టడి చేయగలిగాయి. మరి.. ఎక్కువగా వ్యాప్తి చెందే లక్షణం ఉన్న ఈ ఒమిక్రాన్ వైరస్‌ను క్లాత్ మాస్కులు ఎంత మేరకు కాపాడగలుగుతాయి. సింగిల్ లేయర్ మాస్కులు సురక్షితమేనా? అనే ప్రశ్న ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతోంది.
చాలామటుకు మాస్కులు పలు రకాల క్లాత్‌లతో తయారు అవుతాయి. అవి ఏ బట్టతో తయారు అవుతాయి అనేదే కీలకం.. చూడటానికి కలర్ఫుల్గా ఉంటాయి. మెరిసిపోతాయి.. కానీ అవి కోవిడ్‌ను కట్టడి చేస్తాయి అని మనం నూటికి నూరు శాతం నమ్మలేం.. అన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ట్రిష్ గ్రీన్హాల్గ్ అభిప్రాయపడ్డారు.
మిక్స్డ్ మెటిరియల్తో రెండు లేదా మూడు లేయర్లుగా మాస్కులు తయారు చేస్తే అవి సమర్థంగా పనిచేస్తాయి.. సాధారణ క్లాత్‌తో తయారు చేసినవి ఎటువంటి హెల్త్ స్టాండర్డ్స్‌ను పాటించవు. అదే ఎన్95 రెస్పిరేటర్ లాంటి మాస్కులను తయారు చేసేవాళ్లు కనీసం 95 శాతం క్రిములను, వైరస్‌లను అడ్డుకునేలా తయారు చేస్తారు.. అని ఆయన అన్నారు.
అది ఎటువంటి మాస్క్ అయినా సరే.. ఫిల్టరేషన్ అనేది సరిగ్గా జరగాలి. అలాగే.. ముక్కు, నోరును సరిగ్గా మాస్క్ కవర్ చేయాలి. లేకపోతే ఫిల్టర్ మాస్క్ కూడా పనిచేయనట్టే. అలాగే.. మాస్క్ పెట్టుకున్నా.. సులభంగా శ్వాస పీల్చుకునేలా ఉండాలి. కొందరు క్లాత్ మాస్కులను ఎక్కువగా వాడుతుంటారు. వాటినే రీయూజబుల్ మాస్కులు అంటారు. ఎందుకంటే.. వాటినే మళ్లీ ఉతుక్కొని వేసుకుంటారు. అటువంటి మాస్కులు వాడేవాళ్లు జాగ్రత్తలు పాటించాలి.
అవి సింగిల్ లేయర్ మాస్కులు అయితే.. వైరస్ వ్యాప్తిని అరికట్టలేవు. ఒమిక్రాన్ విషయంలో రీయూజబుల్ క్లాత్ మాస్కులు కూడా అంత సేఫ్ కాదు అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కరోనా గత వేరియంట్లతో ఊపిరి ఆడకపోయేది.. ఒమిక్రాన్‌లో ఈ లక్షణం ఎందుకు లేదు?
ఒమిక్రాన్‌తో కరోనా వైరస్ అంతం కాబోతుందా? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?