న్యూఢిల్లీ: వెల్లుల్లి.. ఇది లేకుండా మసాలా లేదు.. ఇది లేని వంట లేదు అంటే అతిశయోక్తి కాదు. ఇంతకీ వెల్లుల్లి మసాలా దినుసా, లేక కూరగాయా? అంటూ ఏళ్ల తరబడి సాగుతున్న వివాదానికి తెరదించుతూ మధ్యప్రదేశ్ హైకోర్టు వెల్లిగడ్డను కూరగాయ కిందే ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. అయితే దీనిని అటు మసాలా, ఇటు కూరగాయల మార్కెట్లలో అమ్మకాలు జరపవచ్చునంటూ తీర్పులో పేర్కొంది.
వెల్లుల్లికి ఉన్న ఘాటు లక్షణంతో పాటు దానిని మసాలాల్లో తప్పక వినియోగిస్తారు కాబట్టి దానిని అందరూ మసాలా దినుసు కిందే భావిస్తుండే వారు. అయితే 2015లో మధ్యప్రదేశ్లోని రైతులు అది కూరగాయా? మసాలా అన్న విషయం తేలక న్యాయస్థానాలను ఆశ్రయించారు. అయితే కింది కోర్టుల్లో విభిన్న తీర్పులు రావడంతో వ్యాపారులు ఏ నిర్ణయానికీ రాలేకపోయారు. ఈ వివాదానికి ఎట్టకేలకు హైకోర్టు తీర్పుతో తెరపడింది.