న్యూఢిల్లీ, మే 20: మహిళా ఐఏఎస్ అధికారిపై వేధింపులకు పాల్పడ్డాడన్న కేసులో న్యూఢిల్లీ కృషి భవన్లో పనిచేస్తున్న ఐఆర్ఎస్ అధికారి సోహైల్ మాలిక్‌ను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. సోహైల్ పదే పదే తన వెంటపడ్డాడని, వేధింపులకు గురిచేశాడని సదరు మహిళా ఐఏఎస్ అధికారి ఈనెల 16న పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశారు. నిందితుడిపై పోలీసులు కేసు నమోదుచేశారు. శనివారం అరెస్టు అనంతరం ఐఆర్ఎస్ అధికారి బెయిల్‌పై విడుదలయ్యాడు.