కోల్కతా: కోల్కతాలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన జరిగిన ఆర్జీ కర్ వైద్య కళాశాల ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రోగులకు అందించే ఔషధాల కొనుగోళ్లలో సందీప్ ఘోష్ అవకతవకతకు పాల్పడ్డాడని సీబీఐ ఆరోపించింది. సరఫరా చేసే సంస్థల సాంకేతికత మూల్యాంకనం చేయకుండానే టెండర్లు ఖరారు చేశాడని పేర్కొన్నది.
పాక్షికంగా విధుల్లో చేరిన జూడాలు
జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనకు నిరసనగా 42 రోజుల పాటు విధులు బహిష్కరించి ఆందోళన చేసిన పశ్చిమ బెంగాల్ జూనియర్ డాక్టర్లు శనివారం పాక్షికంగా విధుల్లో చేరారు. ప్రభుత్వ దవాఖానల్లో ఔట్ పేషెంట్ విభాగాలు మినహా మిగతా సేవలకు హాజరయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలకు సైతం హాజరవుతున్నామని వారు ప్రకటించారు. కాగా, తమ డిమాండ్లను పూర్తిస్థాయిలో పరిష్కరించడానికి మరో వారం పాటు వేచి చూస్తామని తెలిపారు.