ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం
హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) దుర్మరణం పాలయ్యారని ఆ దేశ అధికారిక మీడియా ‘ఐఆర్ఎన్ఏ’ సోమవారం ధ్రువీకరించింది.
- హెలికాప్టర్ ప్రమాదంలో విదేశాంగ
- మంత్రి సహా ఎనిమిది మంది మృతి
- తాత్కాలిక దేశాధ్యక్షుడిగా మొఖ్బర్
- మా ప్రమేయం లేదు: ఇజ్రాయెల్
- ఇరాన్‌కు అండగా ఉంటాం:భారత్
న్యూఢిల్లీ, మే 20: హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) దుర్మరణం పాలయ్యారని ఆ దేశ అధికారిక మీడియా ‘ఐఆర్ఎన్ఏ’ సోమవారం ధ్రువీకరించింది. ప్రమాదంలో రైసీతోపాటు విదేశాంగ మంత్రి హుస్సేన్ ఆమిర్-అబ్దోల్లాహియన్ (60) సహా మొత్తం 8 మంది మరణించారని తెలిపింది. దుర్ఘటనలో ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడలేని పేర్కొన్నది. ప్రమాద స్థలానికి చేరుకున్న రెస్క్యూ బృందాలు, అక్కడి పరిస్థితిని సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీకి చేరవేశాయి.
అధ్యక్షుడి మృతి నేపథ్యంలో ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ మొఖ్బర్ను తాత్కాలిక అధ్యక్షుడిగా ఖమేనీ నియమించారు. ఆదివారం సాయంత్రం ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయిన విషయం తెలిసిందే. అజర్ బైజాన్ సరిహద్దులో డ్యామ్ ప్రారంభోత్సవానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. భారీ వర్షం, పొగమంచు కారణంగా హెలికాప్టర్ క్రాష్ ల్యాండ్ అయినట్టు ఇరాన్ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. మానవ రహిత విమానాల సాయంతో గాలింపు చేపట్టిన అధికారులు చివరికి ప్రమాద స్థలిని గుర్తించగలిగారు. సోమవారం ఉదయం ఘటనాస్థలానికి చేరుకున్న బృందాలకు విరిగి ముక్కలైన హెలికాప్టర్ శకలాలు కనిపించాయి.
ఇరాన్‌కు అండగా ఉంటాం: భారత్
ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతిపై భారత్, రష్యా, పాక్ సహా పలు దేశాలు సంతాపాన్ని ప్రకటించాయి. ‘ఈ దుఖః సమయంలో ఇరాన్‌కు అండగా ఉంటాం’ అని భారత ప్రధాని మోదీ ‘ఎక్స్’లో సందేశాన్ని పోస్ట్ చేశారు. రైసీ మృతికి నివాళిగా భారత్‌లో మంగళవారం సంతాప దినం పాటించాలని హోం శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అధికారిక భవనాలపై జాతీయ జెండాను అవనతం చేయాలని తెలిపింది. అధికారిక వినోద కార్యక్రమాలేవీ నిర్వహించరాదని పేర్కొన్నది.
మా ప్రమేయం లేదు: ఇజ్రాయెల్
యుద్ధంలో హమాస్‌కు మద్దతుగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ డ్రోన్, మిస్సైల్ దాడులు జరిపింది. ఇది జరిగిన నెల రోజులకు హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు రైసీ చనిపోవడం పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే దుర్ఘటనలో తమ ప్రమేయం లేదని ఇజ్రాయెల్ స్పష్టంచేసింది. 2021లో అధ్యక్షుడిగా రైసీ బాధ్యతలు చేపట్టిన తర్వాత యురేనియం శుద్ధీకరణలో ఇరాన్ మరింత ముందడుగు వేసింది. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు మద్దతుగా డ్రోన్లను సరఫరా చేసింది. దీంతో పాశ్చాత్య దేశాలు-ఇరాన్‌కు మధ్య ఉద్రిక్తతను మరింత పెంచాయి. రైసీ హయాంలో దేశంలో పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు, దేశ ఆర్థిక పరిస్థితి క్షీణించటం..వంటివి చోటుచేసుకున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

