బుధవారం 12 ఆగస్టు 2020
National - Aug 02, 2020 , 21:33:50

ఇరాన్‌లో 17 వేలకు చేరిన కరోనా మరణాలు

ఇరాన్‌లో 17 వేలకు చేరిన కరోనా మరణాలు

టెహ్రాన్‌ : ఇరాన్‌లో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తున్నది. నిత్యం వేలల్లో పాజిటివ్‌ కేసులు నమోదవుతుండగా మరణాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఆ దేశంలో 2,485 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 208 మంది మృతి చెందారు. ఇప్పటివరకు ఆ దేశంలో 3,09,437 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 2 లక్షల 68 వేల మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 17,190 మంది మృత్యువాతపడ్డారు. జులైలో పలు ఇరానియన్‌ ప్రావిన్స్‌లో కరోనా వేగంగా విస్తరించిందని గతవారం ఆ దేశ ప్రధాని హసన్‌ రోహాని తెలిపారు. ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ప్రాంతాల్లో కరోనా మరణాల శాతం 5 రెట్లు పెరిగింది. జులై 28న అత్యధికంగా ఇక్కడ 235 మరణాలు సంభవించాయి. 


logo