Uranium Stockpile: యురేనియంను తరలించనున్న ఇరాన్
Uranium Stockpile: అమెరికా, ఇరాన్ మధ్య ముసాయిదా తీర్మానం కుదిరినట్లు తెలుస్తోంది. మూడో దేశానికి యురేనియం నిల్వలను ఇరాన్ తరలించనున్నది. డీల్ కుదిరితే, 7 రోజుల్లోనే హోర్ముజ్ తెరుచుకోనున్నది.
న్యూఢిల్లీ: అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి శాంతి ప్రతిపాదనకు అంగీకారం కుదిరినట్లు ఓ మీడియా రిపోర్టు ద్వార వెల్లడైంది. అయితే ఇరాన్ తన వద్ద ఉన్న శుద్దీకరించిన యురేనియం నిల్వల(Uranium Stockpile)ను అప్పగించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. మూడో దేశానికి ఆ నిల్వలను అప్పగించనున్నది లేదా శుద్దీకరణను తగ్గించనున్నది. ఇక హోర్ముజ్ జలసంధిని అంతర్జాతీయ నౌకల కోసం తెరవనున్నారు. ఒప్పందం కుదిరిన ఏడు రోజుల్లోనే హోర్ముజ్ తెరిచే అవకాశాలు ఉన్నట్లు అల్ అరేబియా ఆంగ్ల పత్రిక తన కథనంలో పేర్కొన్నది. ఇరు దేశాల ఒప్పందానికి చెందిన ముసాయిదా మీడియాకు చిక్కింది.
అయితే అగ్రిమెంట్ అమలు అంశంలో చైనాను గ్యారెంటీ దేశంగా చేర్చినట్లు తెలుస్తోంది. అమెరికా, ఇరాన్ మధ్య దోహాలో ఆ చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి. న్యూక్లియర్ ప్రోగ్రామ్, మారిటైం సెక్యూర్టీపై ఇరాన్ తన ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఆర్థిక ఆంక్షలను ఎత్తివేసే ప్రక్రియను అమెరికా చూడనున్నది. మధ్యవర్తులు, గ్యారెంటీ దేశాలతో కలిపి వివాద పరిష్కార తీర్మానం చేయనున్నారు.
దౌత్యంలో భాగంగా ఖాతర్ బృందం శుక్రవారం టెహ్రాన్‌కు చేరుకున్నది. ఖతార్ ప్రధాని సలహాదారు నేతృత్వంలో ఆ బృందం టెహ్రాన్‌లో విజిట్ చేస్తున్నది. ఖతార్ ప్రతినిధులకు తమ లేఖను అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సమర్పించారు. మరో వైపు ఇప్పట్లో యుద్ధాన్ని ముగించే ఆలోచనలేదని ట్రంప్ పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uranium Stockpile: యురేనియంను తరలించనున్న ఇరాన్
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమాలో హీరోయిన్గా తెలుగు అమ్మాయి.. రేసులోకి ఆ అమ్మడి పేరు!
School Van | కురవిలో స్కూల్ వ్యాన్ బోల్తా, 12 మంది విద్యార్థులకు గాయాలు.. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా?
Samantha | సినిమాలకు మించి వ్యాపారాల్లో సమంత జోరు.. 8 నెలల్లోనే రూ.120 కోట్ల టర్నోవర్‌తో హాట్ టాపిక్!
Suryapet | సూర్యాపేట జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు 32 ఏళ్ల గొర్రెల కాపరి మృతి!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

