IPS suicide : భార్య క్యాన్సర్ వ్యాధితో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ విషయాన్ని సీనియర్ ఐపీఎస్ అధికారిగా పనిచేస్తున్న భర్తకు డాక్టర్ ఫోన్ చేసి చెప్పారు. ఈ బాధను తట్టుకోలేక భార్య చనిపోయిన నిమిషాల వ్యవధిలోనే ఆ ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకుని చనిపోయారు.
ఈ విషాద ఘటన మంగళవారం (జూన్ 18న) సాయంత్రం అస్సాంలో జరిగింది. అస్సాంలోని స్టేట్ హోమ్ అండ్ పొలిటికల్ డిపార్ట్మెంట్ సెక్రెటరీ శైలాదిత్య చెటియా (2009 బ్యాచ్ ఐపీఎస్ అధికారి) ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
భార్య క్యాన్సర్తో చనిపోయిందని తెలుసుకున్న నిమిషాల వ్యవధిలోనే శైలాదిత్య ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. ఇది చాలా దురదృష్టకర ఘటన అని, ఈ ఘటనతో అస్సాం పోలీసు శాఖ మొత్తం విచారంలో మునిగిపోయిందని పోలీసులు ప్రకటించారు.