బెంగళూరు : ఇటీవలే శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరడానికి వెళ్తున్న ఓ యువ ఐపీఎస్ అధికారిని రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది. కర్ణాటక హసన్ జిల్లాలో ఆదివారం ఈ విషాదం చోటు చేసుకుంది. పోలీస్ వాహనం టైర్ పగిలి డ్రైవర్ నియ్రంతణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. వాహనం రోడ్డు పక్కన ఉన్న ఒక చెట్టును, ఇంటిని ఢీ కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న కర్ణాటక క్యాడర్ 2023 బ్యాచ్ ఐపీఎస్ అధికారి హర్ష్ బర్ధన్(26) తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన దవాఖానలో చికిత్స పొందుతూ మరణించారు. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయట పడ్డారు. హోలెనరసిపూర్ ఏస్పీగా ఆదివారం బాధ్యతలు స్వీకరించడం కోసం బర్ధన్ హసన్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.