PT Usha : పారిస్ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత దిగ్భ్రాంతి కలిగించిందని భారత ఒలింపిక్ సమాఖ్య (IOA) ప్రెసిడెంట్ పీటీ ఉష ఆవేదన వ్యక్తం చేశారు. తాను కొద్దిసేపటి కిందట ఒలింపిక్ విలేజ్ పాలిక్లినిక్‌లో చికిత్స పొందుతున్న వినేశ్‌ను కలిశానని ఆమె తెలిపారు. ఐఓఏ నుంచి తాము ఆమెకు పూర్తి మద్దతు తెలియచేస్తామని భరోసా ఇచ్చామని వెల్లడించారు.
భారత ప్రభుత్వంతో పాటు దేశం యావత్తూ వినేశ్ ఫొగాట్ వెంట ఉందని చెప్పామని తెలిపారు. వినేశ్‌కు అవసరమైన వైద్య సాయంతో పాటు నైతిక స్థైర్యాన్ని కల్పిస్తున్నామని పేర్కొన్నారు. పోటీకి అవసరమైన అర్హతలు పొందేందుకు వినేష్ వైద్య బృందం రాత్రంతా అవిశ్రాంతంగా పనిచేసిందని తమకు తెలుసునని పీటీ ఉష తెలిపారు. కాగా, పారిస్ ఒలింపిక్స్ స్వర్ణ పతకాన్ని గెలుచుకునే అవకాశాన్ని రెజ్లర్ వినేశ్ ఫోగట్ చేజార్చుకున్నది.
ఓవర్ వెయిట్ కారణంగా ఆమెను అనర్హురాలిగా ప్రకటించారు. వాస్తవానికి ఇవాళ ఆమె గోల్డ్ మెడల్ మ్యాచ్ ఆడాల్సి ఉన్నది. అయితే వినేశ్ ఫోగట్ డిస్క్వాలిఫై అయిన నేపథ్యంలో.. భారత ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) స్పందించారు. వినేశ్, నువ్వ చాంపియన్లకే చాంపియన్ అంటూ ఆయన ఎక్స్ అకౌంట్లో కామెంట్ చేశారు. భారత దేశానికి గర్వకారణమని, ప్రతి ఒక్క భారతీయుడికి ప్రేరణగా నిలుస్తున్నావని తెలిపారు.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది.
రెజ్లింగ్ ఫైనల్‌కు (Indian wrestler) చేరిన భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ (Vinesh Phogat) పతకం ఆశలు ఆవిరయ్యాయి. అధిక బరువు కారణంగా ఆమెపై అనర్హత వేటు పడింది. నంబర్ వన్ రెజ్లర్ సుసాకిపై విజయం సాధించి ఫైనల్‌కు చేరిన ఫొగాట్‌పై అనర్హత వేటు పడటం సర్వత్రా షాక్‌కు గురి చేస్తోంది. వినేష్ ఫొగాట్‌పై అనర్హత వేటు దేశానికి నష్టమని బీజేపీ ఎంపీ కరణ్ భూషణ్ సింగ్ అభివర్ణించారు. ఫెడరేషన్ ఈ విషయం పరిశీలించి ఏం చేయాలో నిర్ణయం తీసుకోవాలని కోరారు.
Read More :