న్యూఢిల్లీ: ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 2025లో 90 కోట్లు దాటే అవకాశం ఉందని ‘ఇంటర్నెట్ ఇన్ ఇండియా రిపోర్ట్, 2024’ అంచనా వేసింది. 2024లో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 88.6 కోట్లకు పెరిగింది.
డిజిటల్ కంటెంట్ కోసం ఇండిక్ భాషల వినియోగం వృద్ధి చెందడంతో ఇంటర్నెట్ యూజర్లు 90 కోట్లు దాటిపోయే అవకాశం ఉందని అంచనావేసింది. ఇంటర్నెట్ యూజర్లలో 55 శాతం గ్రామీణ ప్రాంతాలవారే. వీరి సంఖ్య 48.8 కోట్లు.