ఇంపాల్: మణిపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇవాళ్టి నుంచి అయిదు జిల్లాల్లో ఇంటర్నెట్(Manipur Internet)పై ఉన్న ఆంక్షలను ఎత్తివేసింది. తక్షణమే ఆ ఆదేశాల్లో అమలులోకి వచ్చేశాయి. రాష్ట్రంలో ఉన్న శాంతి, భద్రతల పరిస్థితిపై సమీక్షించినట్లు హోంశాఖ కమీషనర్ ఎన్ అశోక్ కుమార్ తెలిపారు. అయితే ఇంటర్నెట్పై ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని డిసైడ్ అయినట్లు తెలిపారు. సెప్టెంబర్ 10వ తేదీ నుంచి ఇంటర్నెట్పై ఆంక్షలు అమలు చేశారు. సెప్టెంబర్ 13వ తేదీన బ్రాడ్‌బ్యాండ్ సేవలను పాక్షికంగా ప్రారంభించారు.
విద్యార్థుల నిరసన నేపథ్యంలో ఇంపాల్ ఈస్ట్, ఇంపాల్ వెస్ట్, బిష్ణుపుర్,తౌబాల్, కాచింగ్ జిల్లాల్లో ఆంక్షలను విధించారు. మిలిటెంట్ల దాడి విషయంలో భద్రతా దళాలు విఫలం అయినట్లు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఆ నిరసనల్లో జరిగిన కాల్పుల్లో సుమారు 80 మంది మరణించారు. దీంట్లో విద్యార్థులు, పోలీసులు కూడా ఉన్నారు.
ఇంటర్నెట్ను పునర్ ప్రారంభిస్తున్నామని, యూజర్లు చాలా బాధ్యతాయుతంగా నెట్‌ను వాడుకోవాలని, అవసరమైన కాంటెంట్‌ను షేర్ చేయవద్దు అని సీఎం ఎన్ బీరేన్ సింగ్ ఓ ప్రకటనలో తెలిపారు.