మైన్పురి: గత లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ అంతటా బీజేపీ వేవ్ కనిపించినా, మైన్పురి లోక్సభ నియోజకవర్గంలో మాత్రం ఎస్పీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ విజయం సాధించారు. ఈ సారి ఎలాగైనా ఎస్పీ కంచుకోటను బద్ధలు కొట్టాలని బీజేపీ శతా విధాలా ప్రయత్నిస్తున్నది. దీంతో ఈసారి ఇక్కడ పోరు మోదీ కీ గ్యారెంటీనా లేక ములాయం లెగసీనా అన్నట్టుగా పోరు ఉన్నది. మైన్పురి మూడు దశబ్దాలుగా ఎస్పీకి కంచుకోటగా ఉన్నది. 2022లో ములాయం మరణం తర్వాత ఇక్కడి నుంచి ఆయన కోడలు, అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ పోటీచేసి గెలుపొందారు. ఈసారి కూడా ఆమె ఇక్కడి నుంచి పోటీచేస్తున్నారు. ములాయం అడుగు జాడల్లో నడుస్తానని, ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తానని ఆమె ప్రచార సభల్లో ప్రధానంగా పేర్కొంటున్నారు. ఈసారి మైన్పురి నుంచి బీజేపీ అభ్యర్థిగా స్థానిక మైన్పురి ఎమ్మెల్యే సదర్ జైవీర్సింగ్ పోటీచేస్తున్నారు. ‘మోదీ గ్యారెంటీ’లతోపాటు తాను చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.