మధ్యప్రదేశ్‌లో మళ్లీ రేగిన చిచ్చు… నవరాత్రి ఉత్సవాలపై కొట్టుకున్న రెండు వర్గాలు
దళిత వర్గానికి చెందినవారు శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గా మాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో గ్రామంలోని అగ్ర వర్ణాలకు చెందిన వారు ఆదివారం తమపై దాడి చేశారని వారు ఆరోపించారు. అయితే మరో వర్గం భిన్నంగా ఆరోపించింది.
భోపాల్: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో మళ్లీ చిచ్చు రేగింది. నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో రెండు వర్గాలకు సంబంధించిన వ్యక్తులు కర్రలతో దారుణంగా కొట్టుకున్నారు. ఎంపీ రాజధాని భోపాల్‌కు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న అగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కంకర్ గ్రామంలోని దళిత వర్గానికి చెందిన వారు శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గా మాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో గ్రామంలోని అగ్ర వర్ణాలకు చెందిన వారు ఆదివారం తమపై దాడి చేశారని వారు ఆరోపించారు. అయితే మరో వర్గం భిన్నంగా ఆరోపించింది. గర్బా వేడుకలో భాగంగా ఇద్దరు అమ్మాయిలు అశ్లీల డ్యాన్స్ చేసినట్లు తెలిపారు. దీనిపై వాగ్వాదం కారణంగా గొడవ మొదలైందని చెప్పారు.
మరోవైపు ఇరు వర్గాల ఆరోపణలపై ఫిర్యాదులు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. కర్రలతో కొట్టుకున్న వీడియో క్లిప్‌లను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. గొడవకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారి తెలిపారు. కాగా, ఇరు వర్గాలు కర్రలతో దారుణంగా కొట్టుకున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

