న్యూఢిల్లీ: ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) అధిపతి తపన్ కుమార్ డేకా పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. 2026 జూన్ వరకు ఆయన పదవీ కాలాన్ని పొడిగించాలని క్యాబినెట్ నియామకాల కమిటీ నిర్ణయించింది. ఇది ఆయనకు రెండవ పొడిగింపు. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
హిమాచల్ ప్రదేశ్ క్యాడర్‌కు చెందిన 1988 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన డేకా 2022 జూన్‌లో ఐబీ డైరెక్టర్‌గా మొదటిసారి రెండేళ్ల పదవీకాలానికి నియమితులయ్యారు. గత ఏడాది జూన్‌లో ఆయన పదవీ కాలాన్ని ఏడాదిపాటు ప్రభుత్వం పొడిగించగా ఇప్పుడు మరో ఏడాది పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.