Tapan Kumar Deka | నిఘా విభాగాధిపతి (ఐబీ చీఫ్) తపన్ కుమార్ డేకా (Tapan Kumar Deka) పదవీకాలాన్ని కేంద్రం మరోసారి పొడిగించింది. కేబినెట్ నియామకాల కమిటీ (Appointments Committee of the Cabinet) మరో ఏడాది పాటూ ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం నిర్ణయంతో 2026 జూన్ వరకు ఆయన ఐబీ చీఫ్‌గా కొనసాగనున్నారు.
హిమాచల్ ప్రదేశ్ కేడర్‌కు చెందిన డేకా 1988 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. 1998లో ఐబీలో చేరారు. 2022 జూలై ఒకటో తేదీన ఆయన ఐబీ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2024లో ఆయన పదవీకాలాన్ని కేంద్రం ఏడాది పాటూ పొడిగించింది. ఈ ఏడాది జూన్ వరకూ ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ గతేడాది ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన పదవీకాలం ముగియనుండటంతో మరోసారి పొడిగించింది.
Also Read..
Spain | మొన్న విద్యుత్.. నేడు మొబైల్ నెట్వర్క్స్.. ఐరోపా దేశంలో ఏం జరుగుతోంది..?
IAF | శత్రు దేశాలకు స్ట్రాంగ్ మెసేజ్.. గూస్బంప్స్ తెప్పిస్తోన్న వాయుసేన వీడియో
Jyoti Malhotra | జ్యోతి మల్హోత్రాపై ప్రశ్నల వర్షం.. వెలుగులోకి కీలక విషయాలు