న్యూఢిల్లీ, ఆగస్టు 6: తన కూతురు కోరిక మేరకు తాను శాకాహారిగా మారినట్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. ఢిల్లీలో హైకోర్టులో డిజిటల్ న్యాయ నివేదికల ఆవిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘నాకు ప్రియాంక, మహి అని ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారు దివ్యాంగులు. వారే నన్ను శాకాహారిగా మార్చారు. నేను, నా భార్య పట్టు, తోలు వస్తువులు కూడా కొనుగోలు చేయం’ అని తెలిపారు. కాగా, 2015లో అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేస్తున్నప్పుడు ఉత్తరాఖండ్‌కు చెందిన ఇద్దరు దివ్యాంగ బాలికలను జస్టిస్ డీవై చంద్రచూడ్ దంపతులు దత్తత తీసుకున్నారు.